మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా చేసిన లాస్ట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమె యూత్‌లో సాలిడ్ ఇంప్రెషన్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు నిహారిక రెడీ అవుతుంది.
యంగ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్లో నటిస్తున్న తన నెక్స్ట్ చిత్రాన్ని నిహారిక ప్రొడ్యూస్ చేయనుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ నయన్ సారికను ఓకే చేశారు మేకర్స్. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. నయన్ సారిక ఇప్పటికే ఆయ్, గం గం గణేశా, క చిత్రాలతో మంచి సక్సెస్‌ను అందుకుంది.
ఇక ఇప్పుడు సంగీత్ శోభన్ సినిమాలోనూ ఆమె సెలెక్ట్ కావడంతో, ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.