మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘నాయక్’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం సారధి స్టూడియోలో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా కొన్ని రోజులు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకోగా, మిగిలిన షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్ మెగా స్టార్ చిరంజీవి గారి ‘శుభలేక రాసుకున్న’ అనే ఫేమస్ పాటని రీమేక్ చేసుకున్నారు.