రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” యు ఎస్ లో రికార్డ్ స్థాయిలో విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం చుట్టూ నెలకొన్న అంచనాల కారణంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల చేస్తున్న ధియేటర్ లను బట్టి చూస్తుంటే ఇది విడుదల రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబట్టేలా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో విడుదల కానుంది ఈ చిత్రాన్ని అక్కడ 100 స్క్రీన్స్ లో విడుదల చెయ్యాలన్న యోచనలో ఉన్నారు. ఒక తెలుగు చిత్రం ఈ స్థాయిలో విడుదల అవుతూ ఉండటం ఇదే మొదటి సారి. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్ర ప్రింట్లు త్వరలో ఇక్కడనుండి బయలుదేరుతాయి. జనవరి 8న అక్కడ ప్రేమియర్లు ప్రదర్శిస్తారు.
రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని డి వివి దానయ్య నిర్మించగా చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఆకుల శివ కథ అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న విడుదల అవుతుంది.