నాయక్ ఆడియో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది

నాయక్ ఆడియో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది

Published on Nov 14, 2012 11:37 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘నాయక్’ ఆడియో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 14న ఈ సినిమా ఆడియో విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు వినాయక్ తెలిపాడు. తన గత సినిమాల్లాగే ట్రైలర్ కూడా ఆడియో రిలీజ్ రోజే విడుదల చేస్తామని, ఈ లోపు నాయక్ లోగో ఆవిష్కరిస్తామని తెలిపాడు. లోగో ఆవిష్కరణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. క్లైమాక్స్, ఒక సాంగ్ మాత్రమే బాలన్స్ ఉన్నాయని డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 9, 11 ఈ రెండు తేదీల్లో ఒక రోజు రిలీజ్ చేస్తామని అన్నాడు. చరణ్ సరసన కాజల్, అమల పాల్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ శుభలేఖ రాసుకున్నా పాటని రీమేక్ చేసి చరణ్, అమల పాల్ పై తీసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు