బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా విజయం పై బాలయ్య తో పాటు ఆయన ఫ్యాన్స్ గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇక బాల కృష్ణ గత ఏడాది వరుస పరాజయాలు ఎదుర్కొనగా ఆయనకు ఈ మూవి హిట్ కావడం చాలా అవసరం. ఇక రెండు రోజులుగా బాలయ్య మూవీపై ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. బాలయ్య సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారట. బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని ఆ వార్తల సారాశం.
ఐతే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఈ టాలెంటెడ్ హీరో స్పష్టత ఇచ్చారు. ప్రచారం జరుగుతున్నట్లు బాలయ్య సినిమాలో ఆయన నటించడం లేదట. ఇక ఆయన ప్రస్తుతం జాతి రత్నాలు అనే మూవీలో నటిస్తిన్నారట. మహానటి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయిందట. లాక్ డౌన్ అనంతరం మిగతా వర్క్ పూర్తి చేసి సినిమా విడుదల చేస్తారట. నవీన్ తాజా ప్రకటనతో ఆ వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇక గత ఏడాది నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యంగ్ డిటెక్టివ్ రోల్ లో నవీన్ చాలా బాగా నటించి ఆకట్టుకున్నారు.