‘బాద్ షా’, ‘వసూల్ రాజా’ సినిమాలలో కనిపించిన నవదీప్ కు ప్రస్తుతం చేతిలో ఎక్కువ సినిమాలే వున్నాయి. ‘బంగారు కోడిపెట్ట’, ‘అంతా నీ మాయలోనే’ మరియు ‘అంత సీన్ లేదు’ వంటి సినిమాలేకాక ‘పొగ’ అనే
సినిమాకూడా వుండగా అవి వివిధదశలలో షూటింగ్ జరుపుకుంటుంన్నాయి
‘బంగారు కోడిపెట్ట’ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకోగా ‘అంత సీన్ లేదు’ షూటింగ్ చివరిదశలో వుంది. నవదీప్, శశాంక్ ప్రధాన పాత్రధారులు. అంకిత మహేశ్వరి, రేయ్హ్నా మల్హోత్రా హీరోయిన్స్. నవదీప్
డబ్బింగ్ ను కూడా పూర్తిచేసుకున్నాడు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు
వెంకట్ కాచర్ల దర్శకుడు. సిద్ధార్ధ్ కు సన్నిహితుడైన చక్రవర్తి రామచంద్ర ఈ సినిమాను బ్యాడ్ మంకీ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతుంది