యంగ్ హీరో నవదీప్ మరియు సదా జంటగా నటిస్తున్న చిత్రం ‘మైత్రి’. ఈ రోజు ఈ చిత్ర ఆడియో హైదరాబాద్లో విడుదలైంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. బ్రహ్మానందం, చిత్రం శీను మరియు ఉత్తేజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సూర్య రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని హను క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్ర నిర్మాతే సొంతంగా ఈ చిత్ర ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.