కొన్నాళ్ల కితం నాసా(నేషనల్ ఆరోనెటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వారు స్టార్ లైనర్ కాప్సూల్ కోసం క్రీవ్ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కి మన భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అలాగే అమెరికా నుంచి బుచ్ విల్మోర్ లని ఒక వారం రోజుల మెషిన్ కోసం గత ఏడాది జూన్ 5న పంపడం జరిగింది.
అయితే అది కాస్తా అక్కడ పలు సాంకేతిక లోపాలు మూలాన వారు అక్కడ సుమారు 9 నెలల పాటుగా ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఇది ఊహించని అంశంగా మారగా వీరు అక్కడ నుంచి తిరిగి రావడం అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఎట్టకేలకి మళ్ళీ ఈ ఇద్దరు తిరిగి వచ్చేందుకు పూనుకోగా సేఫ్ గా ఫ్లోరిడా తీరంలో ఈ మార్చ్ 19 తెల్లవారు జామున సేఫ్ గా ల్యాండ్ అవ్వడం అనేది వీరి మిషన్ కి ఊహించని సుఖాంతంగా మారింది అని చెప్పాలి.
అయితే వీరు భూమికి సేఫ్ గా తిరిగి వచ్చిన హిస్టారిక్ మూమెంట్ పై అనేకమంది శుభాభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నారు. ఇలా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా వీరికి మళ్ళీ భూమి మీదకి వచ్చినందుకు వెల్కమ్ చెప్పారు. ఇదొక నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది.
WELCOME BACK TO EARTH ????
Sunita Williams & Butch Wilmore !! ????HISTORIC & HEROIC ‘HOME’ COMING!!!
Went for 8 Days to Space & Returned after 286 Days, after an Astonishing 4577 orbits around earth !Your Story is Unmatchably Dramatic, Utterly Nerve – Wracking , Unbelievably…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 19, 2025
Welcome home, #Crew9@NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov splashed down off the coast of Florida at 5:57pm ET (2127 UTC), concluding their scientific mission to the @Space_Station: https://t.co/DFWxQIiz6O pic.twitter.com/VQu3DhpTUJ
— NASA (@NASA) March 19, 2025