ప్రతినిధిగా రాబోతున్న నారా రోహిత్

ప్రతినిధిగా రాబోతున్న నారా రోహిత్

Published on Jul 24, 2013 11:40 PM IST

nara-rohit
‘ప్రతినిధి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి నారా రోహిత్ సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో నారా రోహిత్ పాత్ర ప్రతిభంబించేలా ఒక డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు. రాజకీయ వ్యవస్థను ఎదుర్కునే ఒక సాధారణ వ్యక్తి కోణంలో రోహిత్ పాత్రను రూపొందించారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. సుధీర్ సినిమా బ్యానర్ పై సాంబశివరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ మండవ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా నారా రోహిత్ ‘శంకర’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టులో మన ముందుకురానుంది.

తాజా వార్తలు