సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా

sundarakanda Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నారా రోహిత్, శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అభినవ్ గోమటం మరియు ఇతరులు
దర్శకుడు : వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు : సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్ళి
సంగీత దర్శకుడు : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్ : ప్రదీష్ ఎం వర్మ
ఎడిటర్ : రోహన్ చిల్లాలే

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

టాలెంటెడ్ నటుడు నారా రోహిత్ హీరోగా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘సుందరకాండ’. మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సిద్ధార్థ్ (నారా రోహిత్) తనకి కాబోయే భార్యకి కావాల్సిన ఐదు లక్షణాలు లేవని తనకి వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నీ రిజెక్ట్ చేస్తూ వస్తాడు. ఇలా ఒకరోజు ఐరా (వ్రితి వఘని) తన లైఫ్ లో తాను కోరుకున్న లక్షణాలు కలిగిన ఓ కాలేజ్ అమ్మాయిగా తన లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. అక్కడ నుంచి ఆమెకోసం తాను వెతకడం మొదలు పెడతాడు. అలా ఆమెతో ఏజ్ లో కొంచెం గ్యాప్ ఉన్నప్పటికీ తన ప్రపోజల్ ని పెడతాడు. మరి అక్కడ నుంచి కథ ఏమైంది? ఇంత కాలం తాను ఎందుకు సింగిల్ గానే ఉండాల్సి వచ్చింది? ఐరా తన ప్రపోజల్ ని ఏం చేసింది? ఈ కథలో వైష్ణవి (శ్రీదేవి విజయకుమార్) కి లింక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫైనెస్ట్ నటుల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఆ మాట ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పవచ్చు. తన సోలో సినిమా నుంచి మొన్న భైరవం వరకు చూసుకున్నా ఎలాంటి డ్షేడ్ ఉన్న రోల్ ని అయినా చాలా ఈజ్ గా తాను చేస్తారు. ఇప్పుడు సుందరకాండ లో కూడా ఒక లైట్ క్యారెక్టర్ ని కూడా అంతే ఈజ్ గా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా చాలా బాగుంది. సెకండాఫ్ లో తనపై ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

ఇక ఐరా గా కనిపించిన వ్రితి రోల్ సినిమాలో చాలా బాగుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం కానీ అందులో ఆమె నటించిన తీరు బాగా ఇంప్రెస్ చేస్తాయి. తన కాన్ఫిడెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమెలో పరిపక్వత కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంది.

చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన నటి శ్రీదేవి విజయకుమార్ రోల్ కూడా సినిమాలో బాగుంది. కథలో తన రోల్ చూపించే ఇంపాక్ట్ బాగుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ పాత్రని బాగా క్యారీ చేసి రక్తి కట్టించారు.

అలాగే సినిమాలో కమెడియన్ సత్య మంచి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. తన టైమింగ్ మరోసారి వర్కౌట్ అయ్యింది. తనతో పాటుగా వాసుకి ఆనంద్, సునైనా, అభినవ్ గోమటం తదితరులు బాగా చేశారు.

ఈ సినిమా విషయంలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది అని సినిమాకే బిగ్ టర్న్ గా ఉంటుంది అని ముందే టాక్ వచ్చింది. నిజంగా అదే రీతిలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉందని చెప్పవచ్చు. ఒక జెన్యూన్ సర్ప్రైజ్ గా వచ్చి అక్కడ నుంచి సెకండాఫ్ మంచి ఎంగేజింగ్ గా సాగింది. ట్విస్ట్ రివీల్ చేసినప్పటికీ ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ని అలానే ఆద్యంతం మైంటైన్ చేయడం అనేది మంచి విషయం.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో సెటప్ అంతా మంచి ఎంగేజింగ్ గానే ఉన్నప్పటికీ కథ మాత్రం కొంచెం తెలిసినట్టే ఓ బాలీవుడ్ సినిమాని కూడా మరిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత కథనం ఎమోషనల్ పరంగా టచ్ మైంటైన్ చేస్తే బాగుణ్ణు కానీ దర్శకుడు కామెడీ పరంగా తీసుకెళ్లారు.

ఇంకా కొన్ని సన్నివేశాలు ఒకింత ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని మూమెంట్స్ కూడా ఏదో క్లాస్ లా అనిపిస్తాయి. ఇక నటుడు నరేష్, అభినవ్ లాంటి వారిని పెద్దగా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. వారిపై కామెడీ సీన్స్ ఇంకా పెట్టి ఉంటే బాగుండు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాకి తగ్గట్టుగా సెటప్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. అలాగే ప్రదీష్ వర్మ కెమెరా వర్క్ చాలా బాగుంది. లియోన్ జేమ్స్ సంగీతం మాత్రం బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. పాటలు, తన స్కోర్ సినిమాలో చాలా ప్లస్ అయ్యాయి. రోహన్ చిల్లలే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి విషయానికి వస్తే.. తాను తన మొదటి సినిమాకే సాలిడ్ వర్క్ అందించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన బ్యాలెన్సుడ్ కథనం సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. పాత్రలు డిజైన్ చేసుకున్న విధానం కానీ వాటిని తీసుకెళ్లిన తీరు, ట్విస్ట్ లు లాంటివి తన విజన్ ని చూపిస్తాయి. ఫ్యూచర్ లో తన నుంచే ఇదే రీతిలో మైంటైన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సుందరకాండ’ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఒక క్లీన్ రోమ్ కామ్ ఎంటర్టైనర్స్ ని చూడాలి అనుకునేవారికి ఈ వీకెండ్ లో మంచి ఛాయిస్ గా ఈ సినిమా నిలుస్తుంది. నారా రోహిత్ ఇంప్రెసివ్ నటన, ఇతర నటీనటుల పెర్ఫమెన్స్ లు బాగున్నాయి. అయితే కొన్ని మూమెంట్స్ మాత్రం డల్ గా అనిపిస్తాయి కానీ వీటిని పక్కన పెడితే ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version