నారా రోహిత్ నూతన చిత్రంకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో నారా రోహిత్ తో పాటుగా రెజీనా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఇంకా పేరును పెట్టలేదు. ఈ సినిమా మొదటి దశ షూటింగ్ జనవరిలో హైదరాబాద్ శివారులో జరిగింది. ఈ సినిమాలో నారా రోహిత్ క్యారక్టర్ అందరికి నచ్చేదిగా, బాణం సినిమాలా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండవ వారం నుండి మొదలవుతుంది అని దీనిని వేసవి కాలం లో విడుదల చేయడానికి చూస్తున్నామన్నారు. శ్రీ లీల మూవీస్ బ్యానర్ ఫై మరియు కే ఎస్ రామ రావు సమర్పణలో ఆర్ వి చంద్రమౌళి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.