నాని సినిమాకు భారీ రెస్పాన్స్ ఖాయమా.?

మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించిన తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక్కసారిగా ఊపందుకుంది. థియేటర్స్ మూత పడటంతో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్నో చిత్రాలు నేరుగా ఓటీటీ లోకే వచ్చేస్తున్నాయి. కానీ మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం చాలా కాలం తమ చిత్రాలను హోల్డ్ లో పెట్టినా ఇక ఇప్పుడు మరో మంచి ఆప్షన్ లేకపోయే సరికి డిజిటల్ గానే విడుదల చేసేందు రెడీ అవుతున్నారు.

అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో అందుకు సన్నద్ధం అవుతున్న సినిమాల్లో మాత్రం నాచురల్ స్టార్ నాని యాంటీ హీరోగా సుధీర్ బాబు మరో మెయిన్ లీడ్ లో నటించిన తాజా చిత్రం “వి” కి మాత్రం వేరే లెవెల్లో హైప్ కనబడుతుంది. అలాగే ఎన్నో చిత్రాల పేర్లు ఈ డిజిటల్ రిలీజ్ కు వినపడుతున్నప్పటికీ నెటిజన్స్ మరియు ఫిల్మ్ లవర్స్ ఈ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

సో ఇవన్నీ చూస్తుంటే నాని సినిమాకు ఓటీటీలో భారీ వ్యూవర్ షిప్ రావడం ఖాయం అనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసినట్టు సమాచారం. వైవిధ్య చిత్రాల దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో ప్రకటన మరికొన్ని రోజుల్లో రానున్నట్టు టాక్.

Exit mobile version