హీరో నాని నటించిన సినిమాలు విడుదలై దాదాపు సంవత్సరం అవుతోంది. కానీ ప్రస్తుతం తను నటించిన సినిమాలు వచ్చే మూడు నెలలో వరుసగా విడుదల కానున్నాయి. తను నటించిన ‘జండాపై కపి రాజు’ సినిమా విడుదలకు సిద్దంగా వుందని సమాచారం. అలాగే తను నటించిన మరో సినిమా తమిళం కూడా విడుదలకానుంది.
మనం నానిని త్వరంలో తమిళంలో రిమేక్ చేస్తున్న ‘బ్యాండ్ బాజా భారత్’ లలో చూడవచ్చు. ఈ సినిమాలో నాని, వాణి కపూర్ లు హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. రన్ వీర్ సింగ్,అనుష్క శర్మ లు ఈ సినిమా హిందీ వర్షన్ లో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్ ఇన్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ వర్షంలో పేరు ‘ఆహ కళ్యాణం’. ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబందించిన అధికార ప్రకటన త్వరలో వెలువడవచ్చు.
గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూ లో నాని మాట్లాడుతూ ఈ సినిమాని తెలుగు కూడా డబ్ చేనున్నట్టు తెలియజేశాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2014లో విడుదలకానుంది.యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ హెడ్ ఆదిత్య చోప్రా ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ ట్రైలర్ ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి ధరన్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.