డి ఫర్ దోపిడి’ సినిమాలో హీరో నానికి కొంత షేర్ ఉందన్న విషయం తెలిసినదే. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు. అంతేకాక నాని షేర్ కొన్న విషయం తెలిసిన వెంటనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడం విశేషం
ఇప్పుడు ఈ సినిమా ప్రచారంలో కూడా నాని పల్గోనున్నాడని సమాచారం. రేపు ఒక ప్రచారగీతం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరి దగ్గర జరగనుంది. ఈ పాటకోసం మహేష్ శంకర్ మంచి ట్యూన్ ని కూడా అందించారు. ఈ సినిమాను అక్టోబర్ చివరన విడుదలచెయ్యాలని భావిస్తున్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది
ఈ క్రైమ్ కామెడీలో వరుణ్ సందేశ్ మరియు సందీప్ కిషన్ నటిస్తున్నారు. మెలనీ హీరోయిన్. సిరాజ్ కళ్ళా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. క్రిష్ డి.కె మరియు రాజ్ నిదమోరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు