నాని, హరిప్రియ మరియు బిందుమాధవి కలిసి నటించిన ‘పిల్ల జమిందార్’ సినిమా తమిళ భాషలోకి అనువాదంకానుంది. 2011లో విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రేక్షకాదరణ పొంది నానికి ఆ తరువాత ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ వంటి సినిమాల అవకాశాలు దక్కడానికి దోహతపడింది. ‘ఈగ’ సినిమాకు తమిళ వెర్షన్ అయిన ‘నాన్ ఈ’ విజయం సాదించడంతో నానికి అక్కడ గుర్తింపు లబించింది. ఇప్పుడు ఈ ‘పిల్ల జమిందార్’ను ‘జమీన్’ గా డబ్ చెయ్యనున్నారు. కొని రోజుల క్రితమే చెన్నైలో దీని ఆడియో విడుదలైంది. అశోక్.జి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెల్వగణేషన్ సంగీతం అందించాడు. ఇదిలావుంటే బిందుమాధవి కుడా వరుస తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె కొత్త సినిమా ‘కేడి బిల్లా కిలాడీ రంగా’ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకాదరణ పొందింది .