బుక్ మై షోలో ‘హిట్ 3’ ర్యాంపేజ్

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతుండటంతో ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది.

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘హిట్ 3’ మూవీకి సంబంధించి ఏకంగా 1.2 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ మామూలుగా లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version