అరగంట ప్రత్యక్ష నరకం చూసిన నాని.!

nani
ఒకటి రెండు సంవత్సరాల క్రితం ఎస్ఎస్ రాజమౌళి, గౌతం వాసుదేవ్ మీనన్ సినిమాలతో నాని కెరీర్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో తనకు నచ్చిన సినిమాలతో తన కంటూ ఒక దారి ఏర్పరుచుకున్న నాని తన రియల్ లైఫ్ కి వచ్చే సరికి మాత్రం పూర్తి డిఫరెంట్ గా మారింది. ‘నా లైఫ్ లో చాలా విషయాలు నన్ను బాధపెట్టలేదు కానీ లైఫ్ ని సీరియస్ గా తీసుకోవడం నేర్పించాయని’ నాని అన్నాడు.

ఇటీవలే నాని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన లైఫ్ లో తనని మార్చిన ఇన్సిడెంట్ మరియు తనని చావు దాకా వెళ్లి తప్పించుకున్న సందర్భాన్ని గురించి చెప్పాడు. ‘ ఓ సారి మా ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాము. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది. పోయాం అనుకున్న మేము ఎలాగో యామ్బులేన్స్ కి ఫోన్ చేసాం, వచ్చాక అందులో వెళుతున్నాం. అదే దారిలో మరో యాక్సిడెంట్ అయ్యింది. అందులో కొంతమందికి గాయాలయ్యాయి, కొంతమంది అక్కడిక్కడే చనిపోయారు. అక్కడ చనిపోయిన వారిని దెబ్బ తగిలిన వారిని అదే యామ్బులేన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఆ అరగంట ప్రత్యక్ష నరకాన్ని చూసాను. మనం లైఫ్ లో చాలాచిన్న విషయాలను సీరియస్ గా తీసుకుంటాం. కానీ నిజమేమిటంటే మనం అనవసరంగా ఆ విషయాల్లో టైం, ఎనర్జీని వృధా చేస్తున్నామని, వాటికన్నా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని’ అన్నాడు.

మరికొద్ది రోజుల్లో నాని నటించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా రిలీజ్ కానుంది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి సముద్ర ఖని డైరెక్టర్.

Exit mobile version