పెద్దితో ది ప్యారడైజ్ ఫైట్.. నాని ఏమన్నాడంటే?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హిట్-3’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ‘హిట్-3’ ప్రమోషన్స్ వేరే లెవెల్‌లో నిర్వహిస్తన్నాడు నాని. ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని తన నెక్స్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ క్లాష్ పై మాట్లాడారు.

ఇటీవల మార్చి నెలలో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయని.. సినిమాలు మార్చిలో మంచి విజయాలను అందుకుంటే, రాబోయే రోజుల్లో ఇది కూడా సంక్రాంతి సీజన్‌లా మారుతుంది. ఇక తమ సినిమా ‘ది ప్యారడైజ్’ను మార్చి 26, 2026 రిలీజ్ చేయాలని ఆ డేట్‌ను ప్రకటించామని.. అయితే, ఆ తర్వాత రోజు రామ్ చరణ్ ‘పెద్ది’ రానుండటం సంతోషంగా ఉందని నాని అన్నారు. సినిమాలు పోటీ పడటం కామన్. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు.

అయితే, సినిమా రిలీజ్ వాయిదా వేయడం నిర్మాత చేతుల్లో ఉంటుందని.. ‘ది ప్యారడైజ్’ చిత్ర రిలీజ్ పై నిర్మాతదే ఫైనల్ కాల్ అని నాని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ రెండు సినిమాలు షూటింగ్ ముగించుకుని, ముందుగా ప్రకటించిన తేదీలకు వస్తాయో లేదో అనేది వేచి చూడాలి.

Exit mobile version