ఏం చేసినా రివ్యూలు ఆగవు – నాని

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ మే 1న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నాని శరవేగంగా నిర్వహిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో నాని చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అన్నీ తానై సినిమాను ఆయన ప్రమోట్ చేస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా రివ్యూలు, నెగిటివ్ రెస్పాన్స్, క్రిటిక్స్‌పై నాని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలకు రివ్యూలు ఇవ్వడం తప్పనిసరి. దానిని ఎవరు ఏం చేసినా ఆపలేరు. ఓ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ప్రేక్షకులకు తెలిపేది ఈ రివ్యూలే. అయితే, ఈ మధ్యకాలంలో కొందరు క్రిటిక్స్ సినిమా రివ్యూల పేరుతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన అన్నారు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం వారి ఇష్టం. కానీ, ఒకరికి సినిమా నచ్చలేదని.. మిగతావారికి కూడా నచ్చదని చెప్పడం కరెక్ట్ కాదు.

అలాగే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు దానికి మంచి రెస్పాన్స్ ఇస్తారు. సినిమా చూసినరోజే అది డిజాస్టర్ అని డిక్లేర్ చేయకూడదు. ఓ వారం తర్వాత సినిమా నిజంగానే బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతే, అప్పుడు అది డిజాస్టర్ అనాలి. ఇలా నాని తనదైన పద్ధతిలో రివ్యూలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version