డబల్ యాక్షన్ చెయ్యనున్న నాని

డబల్ యాక్షన్ చెయ్యనున్న నాని

Published on Dec 8, 2012 4:25 PM IST


ద్విపాత్రాభినయం అనే కాన్సెప్ట్ తెలుగు చిత్రాలలో గతంలో బాగా ఉపయోగించేవారు. ఎన్టీఆర్,చిరంజీవి,నాగార్జున తదితరులు ఇలా ద్విపాత్రాభినయం చేసి భారీ విజయాలు వారే. కాని ఈ మధ్య ఇలాంటి చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. వి వి వినాయక్ “అదుర్స్” చిత్రంలో జు.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు అయన చేస్తున్న మరో చిత్రం “నాయక్” లో రామ్ చరణ్ డబల్ రోల్ చేస్తున్నారు. నాని కూడా ఇలానే ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రానున్న “జెండా పై కపిరాజు” అనే చిత్రంలో నాని డబల్ రోల్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ప్రారంభం అయిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మరియు పాటలను చాలకుడి,గోవా మరియు చెన్నైలలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో అమలా పాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాని త్వరలో కృష్ణ వంశీ చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుని “జెండా పై కపిరాజు” చిత్రం మీద దృష్టి సారించనున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా ఈ మధ్యనే ఈ నటుడు “బ్యాండ్ బాజా బారాత్” చిత్ర రీమేక్లో నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు