నాని కాస్త ముందు గానే పలకరించనున్నాడా?


నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు మెయిన్ లీడ్స్ లో అదితిరావు హైదరీ మరియు నివేతా థామస్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వి”. వైవిధ్య చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం కోసం ఇపుడు చాలా మందే ఎదురు చూస్తున్నారు. చాలా కాలం సస్పెన్సు అనంతరం ఈ చిత్రాన్ని డిజిటల్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది.

ఇక అక్కడ నుంచి ఈ చిత్రానికి వేరే లెవెల్లో ప్రమోషన్స్ జరగ్గా మూవీ లవర్స్ అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఈ సెప్టెంబర్ 5 నుంచి డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయనున్నారని తెలిసిందే. కానీ నాని మాత్రం ఇంకా కాస్త ముందుగానే పలకరించనున్నారని టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 4 వ తారీఖు రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది. మరి అదే సమయానికి నాని పలకరిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version