‘ది ప్యారడైజ్’ నుంచి క్రేజీగా నాని లుక్ పోస్టర్.. పేరు కూడా అదే రీతిలో పరిచయం

నాచురల్ స్టార్ నాని హీరోగా తాను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మరో సాలిడ్ చిత్రమే “ది ప్యారడైజ్”. అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి నేడు ఓ క్రేజీ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. మరి ఇందులో నాని లుక్ మరింత క్లారిటీగా కనిపిస్తుండగా తన మేకోవర్ కి రెడీ అయ్యిన విధానం చూస్తే మాత్రం నాని గట్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే అనిపిస్తుంది.

ముక్కుకి రెండు రెండులు ఆడపిల్లలా రెండు జడలు వేసుకొని నాని కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈ లుక్ తాలూకా పాత్ర పేరు కూడా అంతే క్రేజీగా ఉంది. ఇంతకీ ఆ పేరేంటనే ‘జడల్’ అట. ఇక ఇదే కాకుండా పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో తుపాకులు గొడ్డళ్లు, ఇంకా బ్లేడ్ లు కూడా కనిపిస్తున్నాయి. వీటితో ప్యారడైజ్ లో రక్తపాతం కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version