తెలుగులో తన టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకున్న నాని పిజ్జా సినిమాలో నటించిన తమిళ్ హీరో విజయ్ సేతుపతికి అభిమానిగా మారిపోయాడు. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ నాని విజయ్ సేతుపతి తాజా చిత్రం ‘పన్నైయారం పద్మినియం’ సినిమా రైట్స్ తీసుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో రిలీజ్ కి నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ ఆడియో విడుదలలో నాని మాట్లాడుతూ ‘ నేను విజయ్ సేతుపతికి పెద్ద ఫ్యాన్. విజయ్ నటించిన రీసెంట్ సినిమా తప్ప అన్ని సినిమాలు చూసాను. ఎప్పుడైతే నేను తన ‘పన్నైయారం పద్మినియం’ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కోగానే నేను ఓ భారీ మొత్తం కి చెందిన ఓ లాటరీ టికెట్ దక్కినట్టు ఫీలయ్యాను. సినిమా చూసిన తర్వాత ఆ జాక్పాట్ నాకే వచ్చిందని ఫీలయ్యాను. ఈ సినిమాలో 4 పాత్రలే ఉంటాయి, అలాగే ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని’ నాకు నమ్మకం ఉందని’ అన్నాడు.
నాని నంటించిన పైసా, జెండా పై కపిరాజు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అలాగే నాని ప్రస్తుతం తమిళంలో రీమేక్ అయితే బ్యాండ్ బాజా బారత్ లో నటిస్తున్నాడు. అలాగే ‘పన్నైయారం పద్మినియం’ సినిమాకి తెలుగు వెర్షన్ వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం నటీనటులను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఒక విలేజ్ లో జరిగే ఈ కథ ప్రీమియర్ పద్మిని అనే కారు చుట్టూ తిరుగుతుంది.