కొచ్చిన్ లో స్టెప్పులేస్తున్న నాని – అమలా పాల్

కొచ్చిన్ లో స్టెప్పులేస్తున్న నాని – అమలా పాల్

Published on Aug 8, 2012 3:55 AM IST


నాని మరియు అమలా పాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు ఉదయం కొచ్చిన్ కి సమీపంలోని చలకుడిలో ప్రారంభమైంది. కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి సముద్రఖని (శంభో శివశంభో ఫేం)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘నిమిరిందు నిల్’ అనే పేరుతో రానుంది. తమిళంలో జయం రవి మరియు అమలా పాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై ఒక పాటని చిత్రీకరించనున్నారని సమాచారం. సామాన్యమైన జీవితాన్ని గడిపే ఒక వ్యక్తి ఒక సామాజిక కారణం కోసం పోరాడడమే ఈ చిత్ర కథాంశం. తొలిసారిగా ఈ చిత్రంలో నాని మరియు అమలా పాల్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు