ఖరారైన నాని – కృష్ణవంశీ సినిమా లోగో లాంచ్ డేట్

Krishna-Vamsi-and-Nani

ట్రెండ్ తో సంబందం లేకుండా, రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు తీసే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పైసా(వర్కింగ్ టైటిల్)’. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా తెలిపారు. నాని సరసన కేథరిన్ థెరిసా – లక్కీ శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ రాయ్ సినిమాటోగ్రాఫర్. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని ఈ సినిమా కాకుండా ‘జెండా పై కపిరాజు’, బ్యాండ్ బాజా బారత్’ సినిమాల్లో నటిస్తున్నాడు.

Exit mobile version