తెలుగులో కేవలం రెండు చిత్రాల్లో నటించిన నందిత మలయాళంలో పెద్ద అవకాశం సాధించింది.‘లండన్ బ్రిడ్జి ‘ అనే చిత్రంలో ముఖ్యమైన పాత్ర సంపాదించింది . పృథ్వి రాజ్ హీరో కి నటిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా జెరేమియా కూడా నటిస్తుంది . గతంలో ఈ చిత్రంలో స్వాతి ముఖ్య పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి కాని మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం స్వాతి ఈ చిత్రంలో నటించట్లేదు. ‘లండన్ బ్రిడ్జి’ పేరు సూచిస్తునట్టుగానే యు.కె మరియు స్కాట్లాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది . అనీల్ సి మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ వారంలో మొదలుకానుంది. తేజ ‘నీకు నాకు డాష్ డాష్’ ద్వారా పరిచయమైన నందిత ‘ప్రేమకధ చిత్రం’ లో సుదీర్ బాబుతో జతకట్టింది.