ప్రేక్షకులకు కను విందు చేయబోతున్న ‘డమరుకం’

ప్రేక్షకులకు కను విందు చేయబోతున్న ‘డమరుకం’

Published on Mar 20, 2012 9:05 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘డమరుకం’ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు కన్నుల విందు చేయనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లోని గ్రాఫిక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అనుష్క ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

తాజా వార్తలు