ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ఫీవర్ పట్టుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దెబ్బతో ఇపుడు వార్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కి ముందు మేకర్స్ నేడు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయగా ఈ ఈవెంట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ని రిలీజ్ చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ డేరింగ్ స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.
ఇది వరకు చాలా ఈవెంట్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా తన సినిమాల రిజల్ట్ కోసం మాట్లాడే నాగవంశీ ఈ సినిమా విషయంలో కూడా అదే తరహా స్టేట్మెంట్ అందించారు. మామూలుగానే నన్ను చాలా తిట్టుకుంటారు. ఈ సినిమా చూసి నచ్చకపోతే అంతకు పదింతలు తిట్టుకోండి అంటూ ఛాలెంజ్ చేసేసారు. దీనితో సినిమా అవుట్ పుట్ విషయంలో తాను ఎంత నమ్మకంగా ఉన్నారో అనేది మనం అర్ధం చేసుకోవచ్చు.