ముగియనున్న నాగార్జున స్లోవేనియా షెడ్యూల్

ముగియనున్న నాగార్జున స్లోవేనియా షెడ్యూల్

Published on May 14, 2013 3:31 AM IST

Nagarjuna

కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘బాయ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్లోవేనియాలో జరుగుతోంది. ఇక్కడ నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ లపై కొన్ని పాటలను, సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఇక్కడ షూటింగ్ ముగియనుంది. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా మాఫియా తరహ కథతో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. వీరభద్రం ‘పూలరంగడు’ లాంటి కామెడీ సినిమాను దర్శకత్వం వహించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి కామెడీ పోరాటాలతో ఉండవచ్చునని నాగార్జున ఫాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం వుంది.

తాజా వార్తలు