త్వరలో రాబోతున్న నాగార్జున ‘శిరిడి సాయి’ ఆడియో

త్వరలో రాబోతున్న నాగార్జున ‘శిరిడి సాయి’ ఆడియో

Published on May 9, 2012 8:26 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నాగార్జున, కీరవాణి, రాఘవేంద్ర రావు ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలు ఎంతటి సక్సెస్ సాధించాయో మనకు తెల్సిందే. ఈ చిత్రాలు సక్సెస్ తో పాటుగా నాగార్జున కెరీర్లో మైలు రాళ్ళుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తీర్చి దిద్దుతున్నారు. షూటింగ్ పూర్తి చెసుకున్ త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు