ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున భక్తి చిత్రం ‘శిరిడి సాయి’లో నటిస్తున్న విషయం తెలిసిందే. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాగార్జున తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక శైలిలో గడుపుతున్నారు. ఎలాంటి పాత్ర పోషించిన అందులో ఇమిడిపోయే నాగార్జున ఈ చిత్రంలో శిరిడి సాయి పాత్రకి 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం రోజు ఆయన భార్య అమల మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాబా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయించారు. శిరిడి సాయి నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కాగా గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.