టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలనుకుంటున్న నాగార్జున

టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలనుకుంటున్న నాగార్జున

Published on Jan 5, 2014 1:00 PM IST

Nagarjuna
టాలీవుడ్ లో కొత్తదనం అంటే వెనకడుగేయని అతి కొద్ది మందిలో కింగ్ నాగార్జున ఒకరు. శివలో పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా, అన్నమయ్య సినిమాలో పరమ భక్తుడిగా ఇలా పలు విభిన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. ఇప్పుడు ఆయన బుల్లి తెరపై కనిపించడానికి మక్కువ చూపుతున్నారు.

ఇటీవలే నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రేక్షకులని చేరుకోవడానికి టీవీ ఓ ప్రధాన మాంద్యంగా తయారయ్యింది. అప్పుడప్పుడు టీవీ షోస్ కి నిర్మాతగా కాకుండా నేను కూడా కనిపించాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇష్టం. కానీ దానికోసం ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్స్ చేయలేదని’ అన్నాడు.ఇటీవల కాలంలో లక్ష్మీ మంచు, రాధిక, కుష్బూ, రోజాలతో పాటుగా ప్రకాష్ రాజ్, అలీ లాంటి వారు కూడా వ్యాఖ్యాతలుగా టీవీ షోస్ చేస్తున్నారు. దాని బట్టి చూస్తే నాగార్జున కూడా త్వరలోనే బుల్లితెరపై కనిపించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నాగార్జున ‘మనం’ సినిమా ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎఎన్ఆర్, నాగ చైతన్య, సమంత, శ్రియ శరన్ లు కూడా ప్రధాన్ పాత్రలు పోషించారు.

తాజా వార్తలు