అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ముగింపు దశలో ఉంది చిత్రం. దీంతో నాగర్జున రంగంలోకి దిగారు. సినిమా ఔట్ పుట్ మొత్తాన్ని పరిశీలించి చిన్న చిన్న మార్పులు చెప్పారట ఆయన. టీమ్ ఆయన సలహాల మేరకు ఛేంజెస్ చేసే పనిలో ఉన్నారట. గతంలో కూడా అఖిల్ ప్రతి చిత్రాన్ని దగ్గరుండి పర్యవేక్షించే వారు నాగ్.
అలాగే ఈసారి కూడా చేశారట. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని మే 22న ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఈ సినిమా ఫలితంపై అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.