విజయ్ సాంగ్ కి నాగ్ స్టెప్పులు.. లోకేష్ సర్ప్రైజ్ చేయనున్నాడా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొన్నాళ్ల నుంచి ట్రాక్ మార్చి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో గానే కాకుండా పలు చిత్రాల్లో మంచి స్టైలిష్ అండ్ పవర్ఫుల్ పాత్రలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇలా తన నుంచి వస్తున్న మరో ఐకానిక్ పాత్రే సైమన్. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో కనిపించనున్న ఈ పాత్ర థియేటర్స్ లో మరింత సర్ప్రైజింగ్ గా ఉండేలా ఉందని చెప్పాలి.

తమిళ్ లో లేటెస్ట్ గా వచ్చిన ప్రోమోలో దళపతి విజయ్ చార్ట్ బస్టర్ సాంగ్ అరబిక్ కుత్తు స్టెప్ ని కింగ్ నాగ్ వేస్తున్న ఫ్రేమ్ వైరల్ గా మారింది. దీనితో నాగార్జున రోల్ ఎంత కొత్తగా కేజ్రీగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. మరి మొత్తానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం నాగార్జున విషయంలో తెలుగు ఆడియెన్స్ ని బాగా సర్ప్రైజ్ చేసేలా ఉన్నాడని అనుకోవచ్చు. ఇక ఈ 14న థియేటర్స్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version