“వైల్డ్ లుక్” పోస్టర్ తో హైప్ పెంచిన కింగ్ నాగార్జున.!

“వైల్డ్ లుక్” పోస్టర్ తో హైప్ పెంచిన కింగ్ నాగార్జున.!

Published on Aug 29, 2020 10:24 AM IST

ఈరోజు టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడు అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున పుట్టినరోజు కావడంతో అక్కినేని అభిమానులు తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా మరో పక్క తారలు కూడా కింగ్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ వదిలారు.

ఇది మాత్రం చాలా ఆసక్తికరంగాను అలాగే ఊహించని విధంగా ఉందని చెప్పాలి. అహిసార్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక ఎన్ ఐ జెడ్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అందుకు రిలేటెడ్ గా విడుదల చేసిన ఈ పోస్టర్ మంచి ఇంటెన్సింగ్ కూడా కూడా ఉంది. ఇప్పటికే 70 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని నిజ జీవిత ఘటనలు ఆధారంగా తెరకెక్కించి. మొత్తానికి మాత్రం కింగ్ నాగ్ అభిమానులకు ఈ పోస్టర్ మంచి హ్=జోష్ ఇచ్చిందని చెప్పాలి. ఈ చిత్రంలో దియా మీర్జా ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా మాట్ని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు