శిరిడి సాయి చిత్రానికి స్పందన బావుంది : నాగ్

శిరిడి సాయి చిత్రానికి స్పందన బావుంది : నాగ్

Published on Jul 5, 2012 11:19 AM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం “శిరిడి సాయి”. ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్స్ ని ఇటీవలే విడుదల చేశారు.ఈ పోస్టర్లని చూసిన సినీ అభిమానులు దైవ సంభందమైన సాయి బాబా పాత్రలో నాగార్జున ఒదోగిపోయారని వస్తున్న స్పందన చూసి నాగార్జున మిక్కిలి సంతోషానికి గురయ్యారు.

గత కొంత కాలంగా ట్విట్టర్ అకౌంట్ కి దూరంగా ఉన్న నాగార్జున ఈ రోజు తన ట్విట్టర్ ద్వారా ” ‘శిరిడి సాయి’ చిత్ర పోస్టర్స్ కి వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉందని, ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు”.

‘శిరిడి సాయి’ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

తాజా వార్తలు