మార్చిలో నాగార్జున ‘లవ్ స్టొరీ’

మార్చిలో నాగార్జున ‘లవ్ స్టొరీ’

Published on Nov 14, 2012 4:41 PM IST


కుటుంబ కథా చిత్రాలు తీస్తూ కుటుంబ సభ్యుల భాధ్యతలు గుర్తు చేస్తూ, కుటుంబ విలువలు తెలియజేస్తూ సినిమాలు తీసే దర్శకుడు దశరద్. అతను తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టొరీ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మీరా చోప్రా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది. ఇటీవలే స్విట్జర్లాండ్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటగా సంక్రాంతి టైంకి వస్తుందని అనుకున్నప్పటికీ ఆ సమయానికి రావట్లేదని సమాచారం. యూనిట్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో షూటింగ్ పూర్తి చేసి మర్చి నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు