ఫైట్ మాస్టర్స్ యూనియన్ కి ఫైట్ మాస్టర్స్ కి మధ్య జరుగుతున్న గొడవల వల్ల నాగార్జున సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న నాగార్జునకి సంభందించిన ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఏపీ స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ధర్నాకి దిగారు. ఏపీ స్టంట్ మాస్టర్స్ యూనియన్లో సభ్యత్వం లేని రామ్ – లక్ష్మణ్, విజయ్, గణేష్ మాస్టర్ లను సినిమాలు చేయకుండా అడ్డుకుంటామని యూనియన్ సభ్యులు హెచ్చరించారు. ఈ గొడవ మీరే పరిష్కరించుకోమని, అప్పటి వరకు షూటింగ్ నిలిపి వేస్తున్నట్లు నాగార్జున వారికి హామీ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్స్ మధ్య ఈ తరహా గొడవలు జరగడం కొత్తేమీ కాదు. తమిళ్ ఫైట్ మాస్టర్స్ తెలుగు సినిమాలకు పని చేయకూడదని గతంలో గొడవలు జరిగి చాల సినిమాలు షూటింగ్ ఆగిపోయాయి. ఈ సారి కూడా మళ్లీ అదే జరిగేలా కనిపిస్తుంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం అయి యధావిదిగా షూటింగ్ జరగాలని కోరుకుందాం.