శివమణి లాక్డౌన్ టైంలో డ్యూటీ చేస్తే పచ్చడిపచ్చడే

కింగ్ నాగార్జున ఓ ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన మీమ్ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడమే కాకుండా ఆ ట్వీట్ ని పిన్ చేశారు. అలాగే శివమణి మూవీ ఆయన ఈ టైం లో చేస్తే పూరి డైలాగ్స్ ఇలానే ఉండేవని ఆ వీడియోలోని డైలాగ్స్ గురించి చెప్పారు. మిమిక్రి ఆర్టిస్ట్ భవిరి రవి తన మిమిక్రి వాయిస్ శివమణి సినిమాలో నాగార్జున పోలీస్ గా రౌడీలకువార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని మీమ్ చేశారు. మాస్కులు వేసుకోవాలని, బయట తిరగొద్దని, మోడీ మాట వినాలని నాగార్జున మిమిక్రి వాయిస్ తో బవిరి రవి చెప్పిన డైలాగ్స్ ఆ వీడియోకి చక్కగా సరిపోయాయి.

కాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2003లో వచ్చిన శివమణి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. నాపేరు శివమణి నాకు కొంచెం మెంటల్.. అనే డైలాగ్ అప్పట్లో చాల ఫేమస్. ఈ చిత్రంలో అసిన్, రక్షిత హీరోయిన్స్ గా నటించారు. చక్రి సంగీతం అందించారు.

Exit mobile version