కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ముందుగా ‘లవ్ స్టొరీ’ అనే టైటిల్ ని అనుకున్నారు, కానీ ఆ తర్వాత ప్రొడక్షన్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. తాజాగా విన్నిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘గ్రీకు వీరుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ విషయం పై అధికారిక ప్రకటన, మూవీ ఫస్ట్ లుక్ ఈ నెల 26న విడుదల చేయనున్నారు.
ఈ టైటిల్ ని నాగార్జున ఫాన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే నాగార్జున కెరీర్లో ‘గ్రీకు వీరుడు నా రాకుమారుడు’ అనే సాంగ్ బాగా పాపులర్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నాగ్ సరసన నయనతార జోడీ కట్టింది. ఈ సినిమాని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.