కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమాలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. రిచా గంగోపాధ్యాయ ఈ సినిమాలో నాగార్జునకు జంటగా నటిస్తుంది. సోనుసూద్ మరియు ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నాగార్జున, సోనుసూద్ నడుమ పోరాటసన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్ బాగా తెరకెక్కిందట. ముఖ్యంగా సోనుసూద్ ఈ ఎపిసోడ్ తెరకెక్కిన విధానంపై చాలా ఆనందంగా వున్నాడు. ” ‘భాయ్’ సినిమాలో నా ఆఖరి రెండు రోజుల చిత్రీకరణ జరిగింది. క్లైమాక్స్ ఫైట్ కోసం తీసిన యాక్షన్ సీన్లు అద్భుతంగా వచ్చాయి. జీనియస్ దర్శకుడు అయిన వీరభద్రంతో కలిసి ఆనందమైన సమయాన్ని గడిపాను” అని ట్వీట్ చేసాడు
ఈ నెల 27 నుండి ఒక పాటను చిత్రీకరించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో సంయుక్తంగా నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు