బిగ్ బోస్ 4 హోస్ట్ ఆయనేనట..!

బిగ్ బోస్ 4 హోస్ట్ ఆయనేనట..!

Published on Mar 14, 2020 3:01 AM IST

తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. సీజన్ సీజన్ కి ఈ షోకి ఆదరణ పెరుగుతూ పోతుంది. మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. 2017లో ప్రసారమైన ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. రెండవ సీజన్ ని కూడా ఎన్టీఆర్ ని వ్యాఖ్యాతగా ఉండాలని షో నిర్వాహకులు కోరినప్పటికీ ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు. సెకండ్ సీజన్ కి హోస్ట్ గా హీరో నాని చేశారు. ఆ సీజన్ సైతం మంచి ఆదరణ దక్కించుకుంది.

కాగా ఇక మూడవ సీజన్ కింగ్ నాగార్జున చేతిలోకి వెళ్ళింది. నాగార్జున నేతృత్వంలోని బిగ్ బాస్ సీజన్ 3 మంచి విజయం అందుకొంది. ఈ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. ఇక కొద్దినెలలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలుకానుంది . దీనికి కూడా వ్యాఖ్యాతగా నాగార్జునే వ్యవహరించనున్నారని సమాచారం. అలాగే ఈ సీజన్ కొరకు ఆయనకు పారితోషికం కూడా భారీగా ముట్టినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు