రామకృష్ణ పరమహంసగా నాగార్జున?


‘కింగ్’ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ఎ. మహేష్ రెడ్డి తన ఆనందాన్ని నిన్న మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ షిర్డీ సాయి ఆశీర్వాదంతో తీసిన ‘శిరిడి సాయి’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చాలా కాలంగా సినిమాలు చూడని వారు కూడా ఈ సినిమాని చూడటం చాలా ఆనందంగా ఉంది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన నేను బాబా మీద భక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆయన అనుగ్రహం ఇలానే ఉంటే ఇంకా సినిమాలు చేయొచ్చు. శిరిడి సాయి సినిమా చూసిన తర్వాత చాలా మంది నాగార్జున గారితో రామకృష్ణ పరమహంస మీద సినిమా తీయొచ్చుగా అని అడుగుతున్నారు. ఆ బాబా దయ నా మీద ఉంటే ఖచ్చితంగా తీస్తాను’ అని ఆయన అన్నారు. ఈ సినిమాకి కథ సిద్దమైతే నాగార్జున గారు ఈ సినిమా చేస్తారా? లేదా? మరియు ఈ సినిమా అసలు కార్య రూపం దాలుస్తుందా లేదా అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

Exit mobile version