యంగ్ హీరో షూటింగ్ కి సిద్ధం అట.

యంగ్ హీరో షూటింగ్ కి సిద్ధం అట.

Published on Jul 23, 2020 3:00 AM IST

సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అది. విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న ఆ సినిమాలో నాగశౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ కనిపించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

లాక్ డౌన్ కి ముందు కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ ఆగింది. కాగా వచ్చే నెల నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తగు జాగ్రత్తలతో షూటింగ్ లో పాల్గొడానికి నాగశౌర్య ఓకే చెప్పాడట. దర్శకుడికి సైతం షూటింగ్ చేయడానికి అభ్యంతరాలు లేకపోవడంతో ఆగస్టులో మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను శరత్ మరార్, నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు