అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న ‘దుర్గ’ సినిమాని ఇటీవలే లాంచనంగా ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ లో నాగ చైతన్య సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఆకుల శివ కథ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. నాగ చైతన్య ఇమేజ్ ని మార్చేలా ఉంటుందని చెబుతున్న ఈ సినిమాని శ్రీ శుభ శ్వేత ఫిల్మ్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ రెండు సినిమాలు కాకుండా నాగ చైతన్య ‘మనం’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అది కాకుండా ‘ఆటోనగర్ సూర్య’ ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.