ఫిబ్రవరి 6న ప్రారంభంకానున్న చైతూ కొత్త సినిమా

naga-chaitanya
నాగచైతన్య కు ఈ యేడాది కెరీర్ పరంగా చాలా మంచి సంవత్సరం అనే చెప్పాలి. మరికొన్ని నెలలో మూడు సినిమాల ద్వారా మనముందుకు రానున్నాడు. ఇప్పుడు చైతూ శ్రీనివాస్ రెడ్డి తో ఒక సినిమా చేయనున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ‘ఢమరుకం’ తీస్తున్నప్పటినుండి వీరిద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి

గతంలో వీరి కలయికలో వచ్చే సినిమా ‘హలో బ్రదర్’ కు రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చైతూ కోసం దర్శకుడు కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. సి. కళ్యాణ్ నిర్మాత. నాగ చైతన్య తో మొదటిసారిగా ఈ సినిమాలో హన్సిక జతకట్టనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా మొదలుకానుంది. మిగిలిన తారల వివరాలు త్వరలోనే తెలుపుతారు

ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా తెరకెక్కిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ లో వున్న చైతూ త్వరలో ఆటోనగర్ సూర్య, మనం సినిమాల ద్వారా మనముందుకు రానున్నాడు

Exit mobile version