నాగచైతన్య కొత్త చిత్రం ‘దుర్గా’ ఈ నెల ఫిబ్రవరి 24నుండి మొదలుకానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. శ్రీ శుభ శ్వేత ఫిల్మ్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. హన్సిక హీరోయిన్
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ “మేము ఈ సినిమాను నాలుగు నెలల క్రితమే మొదలుపెడదాం అనుకున్నాం. అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జులై కు ముగించాలని అనుకుంటున్నాం. రంజాన్ తరువాత సినిమాను విడుదల చేస్తాం. ఈ సినిమా చైతు కెరీర్ లోనే పెద్ద హిట్ అవ్వనుంది”అని అన్నాడు. థమన్ సంగీత దర్శకుడు
ప్రస్తుతం చైతూ విజయ్ కుమార్ కొండా తెరకెక్కిస్తున్న ఒక లైలా కోసం షూటింగ్ లో బిజీగా వున్నాడు. నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు