బురదలో ఫైట్స్ చేస్తున్న నాగ చైతన్య

బురదలో ఫైట్స్ చేస్తున్న నాగ చైతన్య

Published on May 12, 2012 7:18 PM IST


త్వరలో రానున్న నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. దేవ కట్టా డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని కె. అచ్చి రెడ్డి మాక్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా నాగ చైతన్య, అజయ్ లపై ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వర్షం + డీజిల్ + గ్రీస్ అన్ని కలగలిపిన బురదలో ఈ ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆటో నగర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంతా హీరొయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు