ఒకలైలాకోసం సినిమా షూటింగ్ లో ప్రస్తుతం నాగ చైతన్య బిజీగా వున్నాడు. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్.
ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ప్రస్తుతం నాగచైతన్య రామ్ లక్ష్మణ్ ల సారధ్యంలో ఒక పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కధను గోప్యంగా వుంచినా దర్శకుడు హీరో హీరోయిన్లను చాలా పొగిడేస్తున్నాడు.
అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. అండ్రూ సినిమాటోగ్రాఫర్. వేసవిలో ఈ సినిమా మనముందుకు రానుంది.