నాయక్ సెన్సార్ కట్ వివరాలు

Ramcharan-Naayak-Censor2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాయక్’ సినిమాకి సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారని ఇదివరకే తెలిపాము. సెన్సార్ వారు విదించిన కట్స్ వివరాలను ఇప్పుడు మీకందిస్తున్నాము. మీరు పై ఫోటోలో చూస్తే ఎ సీన్స్ కట్ చేసారు, అలాగే ఎ డైలాగ్స్ మ్యూట్ చేయమన్నారు అనేది తెలుస్తుంది.

మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ – అమలా పాల్ తమ గ్లామర్ తో ఆకట్టుకోనున్నారు. చరణ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కోల్ కతాలో షూట్ చేసారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని డి.వి.దానయ్య నిర్మించారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version